దేశ వ్యాప్తంగా మండుతున్న ఎండలు 2 h ago
దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్న నేపథ్యంలో పలు ఉత్తరాది రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచనలు చేసింది. మూడు రోజుల పాటు వేడిగాలుల తీవ్రత ఉంటుందని తెలిపింది. ఏపీ, తెలంగాణలోనూ ఎండల తీవ్రత అధికంగా ఉందని, మరో మూడు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది.